Header Banner

పాక్‌ ప్రయోగించిన డ్రోన్ల లెక్కలు బయటపెట్టిన ప్రభుత్వం! 50, 100 కాదు.. ఏకంగా..!

  Fri May 09, 2025 19:03        India

భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరులో భాగంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రతీకారమంటూ యుద్ధానికి కాలు దువ్విన పాకిస్థాన్‌ గురువారం రాత్రి జమ్మూ కశ్మీర్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో డ్రోన్లను ప్రయోగించింది. వాటిని భారత డిఫెన్స్‌ సిస్టమ్‌ గాల్లోనే పేల్చినట్లు సమాచారం వచ్చింది. అయితే ఓ 50 డ్రోన్లతో పాక్‌ దాడి చేసినట్లు ప్రాథమికంగా తెలిసినా.. అసలు విషయం తాజాగా కల్నల్ సోఫియా బయటపెట్టారు. జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లోని 36 పట్టణ జనాభా కేంద్రాలలో లేదా సమీపంలో భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ 300 నుండి 400 టర్కిష్ డ్రోన్‌లను అర్ధరాత్రి దాడులకు ప్రయోగించిందని కల్నల్ సోఫియా ఖురేషి శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు.

వందలాది డ్రోన్లను భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఇది ఇప్పటికే ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే అని కల్నల్ ఖురేషి అన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి కొనసాగుతున్న కాల్పులు, ఫిరంగి దాడులలో ఒక సైనికుడు సహా 16 మంది భారతీయులు మరణించారని కల్నల్‌ తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం తన పాక్‌కు భారీ నష్టం కలిగించిందని, వందలాది డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసిందని, లాహోర్‌లో చైనా తయారు చేసిన HQ-9 వ్యవస్థతో సహా పాకిస్తాన్ వైమానిక రక్షణ నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేసినట్లు కల్నల్ ఖురేషి మీడియాకు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: శంషాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్‌..! ప్రయాణికులకు కీలక సూచనలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #India #declared #pakdrones #count #36places #attacked